డిసెంబర్ 28న యూఏఈ లాటరీ డ్రా.. మొదటి 11మందికి Dh100,000..!!
- December 27, 2024
యూఏఈ: మొదటి యూఏఈ లాటరీ డ్రాలో తొలి 11 మంది విజేతలు ఒక్కొక్కరికి Dh100,000 ప్రకటించిన తర్వాత ఉత్కంఠ పెరిగిందని ఆపరేటర్ చెప్పారు. డిసెంబర్ 14న జరిగిన మొదటి డ్రాలో అసాధారణమైన డిమాండ్ వచ్చిందని, ఇప్పటికే 29,000 మందికి పైగా విజేతలను గుర్తించినట్లు తెలిపారు. డిసెంబర్ 28న రెండవ డ్రా జరుగనుందని పేర్కొన్నారు. .
మొదటి డ్రాలో, మొదటి రెండు బహుమతులు Dh100 మిలియన్, Dh1 మిలియన్లు క్లెయిమ్ కాలేదన్నారు. బహుమతులు ఆటోమెటిక్ గా పాల్గొనేవారి ఖాతాలలో జమవుతుందన్నారు. "డ్రా తర్వాత, మా ప్రైజ్ క్లెయిమ్ కమిటీ గెలిచిన పార్టిసిపెంట్లను సంప్రదిస్తుంది. ప్రత్యేకమైన 'విజేత వేడుక'కి హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తుంది. మేము విజేతలను మా సోషల్ మీడియా ఛానెల్లలో ప్రకటిస్తాము. చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తాము. మా విజేతల లభ్యతను బట్టి , ఈ మొత్తం ప్రక్రియ కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు ఉంటుంది" అని ఆపరేటర్ చెప్పారు.
లాటరీ Dh100 మిలియన్ల జాక్పాట్ను అందిస్తుందని, రెండవ బహుమతి 1 మిలియన్ లతోపాటు Dh100 మరియు Dh100,000 మధ్య ఇతర మొత్తాలను విజేతలకు అందజేస్తామని తెలిపారు. వీటితోపాటు ఏడు 'లక్కీ ఛాన్స్ IDలు' ఒక్కొక్కటి Dh100,000 గెలుచుకోవడం గ్యారెంటీ అని వివరించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







