న్యూ 3-లేన్ బ్రిడ్జి.. దీరా వెళ్లే వారి ట్రాఫిక్ కష్టాలకు చెక్..!!

- December 29, 2024 , by Maagulf
న్యూ 3-లేన్ బ్రిడ్జి.. దీరా వెళ్లే వారి ట్రాఫిక్ కష్టాలకు చెక్..!!

దుబాయ్: దుబాయ్‌లో కొత్తగా 3-లేన్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. కొత్త బ్రిడ్జి ఇప్పుడు షేక్ రషీద్ రోడ్ నుండి ఖలీద్ బిన్ అల్ వలీద్ స్ట్రీట్‌కు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలను తొలగిస్తుందని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. అల్ షిందాఘా కారిడార్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ 4వ ఫేజ్‌లో భాగమైన మూడు లేన్ల బ్రిడ్జి 4.8 కి.మీ. పొడవు ఉంటుంది. ఈ బ్రిడ్జి గుండా గంటకు 4,800 వాహనాలు వెళ్లే సామర్థ్యం ఉంటుందని అథారిటీ తెలిపింది.

కొత్త బ్రిడ్జి షేక్ రషీద్ రోడ్, షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్‌తో సర్కిల్ వద్ద, ఖలీద్ బిన్ అల్ వలీద్ స్ట్రీట్‌లోని అల్ సఖర్ సర్కిల్ కి కలుపుతుంది, అల్ షిందాఘా హిస్టారికల్ ఏరియా, ఇన్ఫినిటీ బ్రిడ్జ్ , దీరా వంటి కీలక ప్రాంతాల ప్రజలకు సహాయంగా నిలువనుంది.    షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్ నుండి షేక్ రషీద్ రోడ్ సర్కిల్ నుండి ఇన్ఫినిటీ బ్రిడ్జ్ వరకు వెళ్లే ట్రాఫిక్ కోసం తాజా  బ్రడ్జి ప్రయాణ సమయాన్ని 12 నిమిషాల నుండి కేవలం నాలుగు నిమిషాలకు తగ్గిస్తుందని అథారిటీ పేర్కొన్నది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com