పబ్లిక్ రోడ్‌ను బ్లాక్ చేస్తే..గరిష్ఠంగా SR100000 జరిమానా..!!

- December 29, 2024 , by Maagulf
పబ్లిక్ రోడ్‌ను బ్లాక్ చేస్తే..గరిష్ఠంగా SR100000 జరిమానా..!!

రియాద్: పబ్లిక్ ఫెసిలిటీస్ రక్షణ నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పబ్లిక్ రోడ్డు లేదా వరద డ్రైనేజీ మార్గాలను దెబ్బతీయడం, బ్లాక్ చేయడం చేస్తే దెబ్బతిన్న ప్రాంతాన్ని మరమ్మతు చేయడానికి అయ్యే ఖర్చులో 75 శాతం జరిమానా (SR100000 వరకు)  విధించబడుతుంది. ఈ మేరకు మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రి మాజిద్ అల్-హోగైల్ నిబంధనలను ఆమోదించారు.  అదే విధంగా డ్రైనేజీ మార్గాలను దెబ్బతీస్తే మరమ్మతులతోపాటు 10 శాతం జరిమానా(SR100000 మించకుండా) విధిస్తారు.  రోడ్లపై వాహనాలను కడిగితే, SR3000 జరిమానా విధిస్తారు.  

నీరు లేదా విద్యుత్ మీటర్లు, పబ్లిక్ టెలిఫోన్ పరికరాలు లేదా వాటి ఇన్‌స్టాలేషన్‌లను వాటి పనితీరుకు అంతరాయం కలిగించే లేదా నష్టం కలిగించే ఉద్దేశ్యంతో ట్యాంపర్ చేసే ఎవరికైనా SR3000 వరకు జరిమానా విధించబడుతుంది. పబ్లిక్ ఫెసిలిటీల రక్షణ చట్టం ప్రకారం..  ప్రజా సౌకర్యాలు అంతరాయం లేకుండా పనిచేస్తూనే ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. పబ్లిక్ సౌకర్యాలను దెబ్బతీయడానికి వివిధ ఉద్దేశాలను వివరిస్తాయి.  ఈ నిబంధనలలో పేర్కొన్న ఏవైనా ఉల్లంఘనలు పునరావృతమైతే, జరిమానా రెట్టింపు అవుతుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com