జనవరి నుండి దుబాయ్ లో ‘స్మార్ట్ రెంటల్ ఇండెక్స్’..!!

- December 30, 2024 , by Maagulf
జనవరి నుండి దుబాయ్ లో ‘స్మార్ట్ రెంటల్ ఇండెక్స్’..!!

దుబాయ్: జనవరి నుండి దుబాయ్లో కొత్త ‘స్మార్ట్ రెంటల్ ఇండెక్స్’ ప్రారంభం కానుంది. ఈమేరకు స్మార్ట్ ఇండెక్స్ ను ప్రారంభించనున్నట్లు ఎమిరేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ ప్రకటించింది. కొత్త ఇండెక్స్ దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగాన్ని నియంత్రిస్తుందని తెలిపింది.  
దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ ప్రకారం.. ఇండెక్స్ ఓనర్స్, రెంటర్స్ లలో నమ్మకాన్ని కలిగిస్తుంది.  కొత్త ఇండెక్స్ పెట్టుబడిదారులు, ఓనర్స్, రెంటర్స్ సహా అన్ని వర్గాలకు ఖచ్చితమైన, తాజా డేటాను అందిస్తుందని రెగ్యులేటర్ తెలిపింది.
ఎమిరేట్లోని ఓనర్స్, ప్రాపర్టీ బ్రోకరేజ్ కంపెనీలకు కొత్త రెంట్స్ ను అంచనా వేయడానికి,  లెక్కించడానికి ఇండెక్స్ ఒక బెంచ్మార్క్ గా పనిచేయనుంది. రెంటల్ ఇండెక్స్లో తాజా అప్డేట్ మార్చిలో మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉంటుందని ప్రకటించారు.  
దుబాయ్లో రెంట్స్ గత నాలుగు సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతున్నాయి. ఎమిరేట్లోకి కొత్త నివాసితులు, ఇన్వెస్టర్ల రాకతో ఈ ఏడాది మాత్రమే 100,000 కంటే ఎక్కువ జనాభా పెరిగింది. కుష్మన్ వేక్ఫీల్డ్ మరియు కోర్ ప్రకారం.. 2024 మూడవ త్రైమాసికంలో నగరవ్యాప్తంగా రెంట్స్ 18 శాతం పెరిగాయి.  విల్లా రెంట్స్ కూడా 13 శాతం పెరిగాయి. అదే సమయంలో అపార్ట్మెంట్ అద్దెలు సైతం 19 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.
2024 మూడవ త్రైమాసికంలో దుబాయ్ లో దాదాపు 9,157 రెసిడెన్షియల్ యూనిట్లు డెలివరీ అయ్యాయి. అపార్ట్మెంట్లు, విల్లాలతో సహా 2024 లో మత్తం 22,900 యూనిట్లు డెలివరీ అయినట్లు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
ఆగస్ట్ 2024లో అబుదాబి రియల్ ఎస్టేట్ సెంటర్ (ADREC)  అబుదాబి రియల్ ఎస్టేట్ సెక్టార్ రెగ్యులేటర్  కోసం మొదటి రెసిడెన్షియల్ రెంటల్ ఇండెక్స్ను ప్రారంభించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com