రస్ అల్ ఖైమాలో కూలిన విమానం..భారతీయుడు సహా ఇద్దరు మృతి..!!
- December 30, 2024
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా విమాన ప్రమాదంలో 26 ఏళ్ల డాక్టర్‌తో పాటు ఇద్దరు మృతి చెందారు. గురువారం (డిసెంబర్ 26) రస్ అల్ ఖైమా తీరంలో జాజిరా ఏవియేషన్ క్లబ్ నుండి రెండు సీట్ల గ్లైడర్ కుప్పకూలింది. జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జిసిఎఎ) ప్రమాదాన్ని ధృవీకరించింది. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతుందని పేర్కొంది. బాధిత కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది.
మరణించిన 26 ఏళ్ల భారతీయ వైద్యుడు సులేమాన్ అల్ మాజిద్.. యూఏఈలో పుట్టి పెరిగాడు. బీచ్‌కు సమీపంలో ఉన్న కోవ్ రొటానా హోటల్ సమీపంలో మధ్యాహ్నం 2 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయిందని అతని తండ్రి మజిద్ ముకర్రం తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్ అనే 29 ఏళ్ల పాకిస్థాన్ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది.
డాక్టర్ సులేమాన్ రైడ్ కోసం గ్లైడర్‌ను అద్దెకు తీసుకున్నారు. అతని కుటుంబం, అతని తండ్రి, తల్లి, తమ్ముడితో సహా ఏవియేషన్ క్లబ్లో ఉన్నారు. సులేమాన్ తర్వాతర అతడి తమ్ముడు విమానంలో వెళ్లాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







