తెలంగాణలో శిశు ఆధార్ పథకం

- June 28, 2016 , by Maagulf
తెలంగాణలో శిశు ఆధార్ పథకం

రాష్ట్రప్రభుత్వం తెలంగాణ శిశు ఆధార్ పేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా పుట్టిన ప్రతీ బిడ్డకు 20 నిమిషాల్లోనే ఆధార్‌కార్డ్, జనన ధ్రువీకరణ పత్రాలు జారీచేయనున్నారు. జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చే అధికారాన్ని ఆస్పత్రి సూపిరింటెండెంట్‌కు ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని మొదట ప్రయోగాత్మకంగా వారం రోజుల్లో నయపూల్ ప్రసూతి ఆస్పత్రిలో అమలు చేయనుంది. జులై 15కల్లా పేట్ల బురుజు, కోఠి ప్రసూతి ఆస్పత్రి, నిలోఫర్, ఉస్మానియా ఆస్పత్రుల్లో అమలు చేయనుంది. జీహెచ్‌ఎంసీ, తెలంగాణ ఐటీ శాఖ ఆధార్ ప్రాంతీయ కార్యాలయం సంయుక్త నిర్వహణలో ప్రాజెక్టు అమలు కానుంది. ప్రభుత్వం తెలంగాణ శిశు ఆధార్ పథకాన్ని దశల వారీగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అమలు చేయాలని నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com