చరిత్రలో అత్యంత రద్దీగా దుబాయ్ ఎయిర్పోర్ట్..!!

- January 04, 2025 , by Maagulf
చరిత్రలో అత్యంత రద్దీగా దుబాయ్ ఎయిర్పోర్ట్..!!

దుబాయ్: 2025 మొదటి 15 రోజుల్లో విమానాశ్రయం 4.3 మిలియన్ల మంది ప్రయాణికులను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) ప్రకటించింది. జనవరి నెల మొత్తం బిజీగా ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. 2018-2019లో మహమ్మారికి ముందు స్థాయిల కంటే ఎక్కువగా ప్రయాణికుల సంఖ్య ఉందని తెలిపింది. 311,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉన్నందున రోజువారీ ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని DXB తెలిపింది.

“ప్రతిరోజూ సగటున 287,000 మంది అతిథులు ప్రయాణిస్తున్నారు.2024లో ఇదే కాలం కంటే 8 శాతం ఎక్కువ.  2018-19లో మహమ్మారి ముందు ఉన్న స్థాయిల కంటే 6 శాతం ఎక్కువ. గ్లోబల్ ట్రావెల్ డిమాండ్‌ నేపథ్యంలో ఇది సాధ్యమైంది. ”అని DXB వెల్లడించింది. ఈ సందర్భంగా కొన్ని టిప్స్ విడుదల చేసింది.

ప్రయాణీకులు సాఫీగా సాగేందుకు ముందుగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ట్రావెల్ నియమాలకు కట్టుబడి ఉండాలని కోరింది. వీడ్కోలు ఇంట్లోనే చెప్పాలని, పీక్ పీరియడ్‌లలో టెర్మినల్స్‌లో ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తారని తెలిపింది. 12 ఏళ్లు పైబడిన పిల్లలు ఉన్న కుటుంబాలు స్మార్ట్ గేట్‌లను ఉపయోగించడం ద్వారా పాస్‌పోర్ట్ నియంత్రణను వేగవంతం చేయవచ్చు.  హ్యాండ్ బ్యాగేజీలో మెటల్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, లిక్విడ్, ఏరోసోల్స్, జెల్‌లపై నిబంధనలను పాటించాలి. పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలు, పవర్ బ్యాంక్‌లు, స్పేర్ బ్యాటరీలు చెక్-ఇన్ లగేజీలో నిషేధించారు. వాటిని తప్పనిసరిగా హ్యాండ్ లగేజీగా తీసుకెళ్లాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com