నేడే ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..ముఖ్య అతిధిగా డెప్యూటీ సీఎం
- January 04, 2025
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్, పాటలు, ట్రైలర్ ను విడుదల చేయగా అదిరిపోయే స్పందన వచ్చింది. ఇక నేడు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
శనివారం సాయంత్రం రాజమండ్రిలో ఈ వెంట్‌ను గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
అబ్బాయి కోసం బాబాయ్ రాబోతుండడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఈ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. రాజమండ్రితో పాటు చుట్టు పక్కల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తరలివస్తున్నారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్ పాల్గొంటున్న తొలి సినిమా ఈవెంట్ ఇదే.
శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. శ్రీకాంత్, అంజలి, ఎస్జే సూర్య లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
A groundbreaking move with the #MegaPowerEvent 💥
— Game Changer (@GameChangerOffl) January 4, 2025
Get ready to witness great things today in presence of honorable Deputy CM of Andhra Pradesh @pawankalyan garu✨ today at rajahmundry
The #MegaPowerEvent is going to be MASSIVE
📍 Rajahmundry#GameChanger… pic.twitter.com/7NO67dkjnb
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







