అక్టోబర్ 2024లో 30% పెరిగిన సౌదీ ట్రేడ్ సర్ ప్లస్..!!

- January 04, 2025 , by Maagulf
అక్టోబర్ 2024లో 30% పెరిగిన సౌదీ ట్రేడ్ సర్ ప్లస్..!!

రియాద్: సౌదీ అరేబియా ట్రేడ్ 30 శాతం నెలవారీ వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్ 2024లో SR 20.769 బిలియన్ల సర్ ప్లస్ ను సాధించింది. ఈ మేరకు ఇటీవల గ్లోబల్ ట్రేడ్ బులెటిన్ విడుదల చేసింది. ఇది గత సెప్టెంబర్ నెలలో SR 15.999 బిలియన్ల నుండి SR 4 బిలియన్ల పెరుగుదలను నమోదు చేసింది. అక్టోబర్‌లో మొత్తం అంతర్జాతీయ వాణిజ్య పరిమాణం SR 164.794 బిలియన్లకు చేరుకుంది. ఇది సెప్టెంబర్‌లో SR 162.200 బిలియన్లుగా ఉంది.  రెండు శాతం(SR2.594 బిలియన్లు) వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతులు మొత్తం వాణిజ్య పరిమాణంలో SR 92.782 బిలియన్లను అందించగా, దిగుమతులు SR 72.012 బిలియన్లుగా ఉన్నాయి.

అక్టోబర్‌లో చమురుయేతర ఎగుమతులు మొత్తం SR 19.413 బిలియన్లుగా ఉంది. ఇది మొత్తం ఎగుమతుల్లో 21 శాతానికి సమానం. అదే సమయంలో చమురు ఎగుమతులు SR 67.399 బిలియన్లు, మొత్తం ఎగుమతుల్లో 72.6 శాతం. అరబ్,  ఇస్లామిక్ దేశాలు మినహా ఆసియా దేశాలు సౌదీ సరుకుల ఎగుమతులకు అగ్ర గమ్యస్థానంగా నిలిచాయి. ఇవి మొత్తం 52.2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వీటి విలువ SR 48.409 బిలియన్లు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలు మొత్తంలో 13.1 శాతంతో(SR 12.157 బిలియన్లు) రెండవ స్థానంలో ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ 13 శాతంతో (SR 12.071 బిలియన్లు) తర్వాతి స్థానంలో ఉంది.

అక్టోబర్ 2024లో మొత్తం ఎగుమతులలో 16.1 శాతంతో చైనా టాప్ ఉండగా, ఇండియా SR 8.793 బిలియన్లతో (9.5 శాతం) రెండవ స్థానంలో ఉంది. జపాన్ 9.4 శాతంతో (SR 8.703 బిలియన్లు) మూడవ స్థానంలో నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com