ROP అధికారులకు రాయల్ కమెండేషన్, సర్వీస్ మెడల్స్ ప్రదానం..!!
- January 06, 2025
నిజ్వా: సుప్రీమ్ కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్.. రాయల్ ఒమన్ పోలీస్ (ROP)లోని కొంతమంది సీనియర్ అధికారులకు రాయల్ కమెండేషన్, సర్వీస్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ పతకాలను దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి సయ్యద్ ఖలీద్ హిలాల్ అల్ బుసైదీ పిన్ చేశారు. సుల్తాన్ ఖబూస్ అకాడమీ ఫర్ పోలీస్ సైన్సెస్‌లో ఈ వేడుక జరిగింది. రాయల్ సన్మానం సందర్భంగా సయ్యద్ ఖలీద్ అధికారులను అభినందించారు. ఈ వేడుకకు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ కస్టమ్స్ లెఫ్టినెంట్ జనరల్ హసన్ మొహ్సిన్ అల్ ష్రైకీ, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ కస్టమ్స్ ఫర్ ఆపరేషన్స్ మేజర్ జనరల్ అబ్దుల్లా అలీ అల్ హర్తీ, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ కస్టమ్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ అఫైర్స్ మేజర్ జనరల్ ఖలీఫా అలీ అల్ సియాబీలతోపాటు పలువురు సీనియర్ ROP అధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







