జెడ్డాకు రెడ్ అలెర్ట్..భారీ వర్షం కురిసే అవకాశం..!!

- January 06, 2025 , by Maagulf
జెడ్డాకు రెడ్ అలెర్ట్..భారీ వర్షం కురిసే అవకాశం..!!

జెడ్డా: జెడ్డాలో సోమవారం మధ్యాహ్నం 3:00 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NMC) రెడ్ అలర్ట్ ప్రకటించింది. బలమైన గాలులతోపాటు వడగళ్ళు, ఈదురుగాలులు, ఎత్తైన అలలు, ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు వీస్తాయని కేంద్రం పేర్కొంది.  మక్కా ఎమిరేట్‌లోని క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ హైవేలు,  బీచ్‌లకు వెళ్లే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వివిధ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనల మధ్య అత్యంత అప్రమత్తంగా ఉండాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ప్రజలను కోరింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని, అలాగే లోయలు వరదలకు గురయ్యే ప్రదేశాలను నివారించాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com