రియాద్ మెట్రో.. అందుబాటులోకి మొత్తం 6 లైన్లు..!!
- January 06, 2025
రియాద్: రియాద్ మెట్రోలోని ఆరెంజ్ లైన్ ప్రారంభంతో మొత్తం ఆరు లైన్లు అందుబాటులోకి వచ్చాయని రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) ప్రకటించింది. మదీనా రోడ్‌ను కవర్ చేసే లైన్ 3 (ఆరెంజ్ లైన్) రియాద్ ఈస్ట్ ను వెస్ట్ కు కలుపుతుంది. జెడ్డా వెస్ట్ రోడ్ నుండి తూర్పున ఖాష్మ్ అల్-ఆన్ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రెండవ ఈస్ట్ రింగ్ రోడ్డు వరకు మొత్తం 41 కి.మీ. పొడవుతో నిర్మించారు. రియాద్ మెట్రో నెట్‌వర్క్‌లోని ఆరు లైన్ల దశలవారీ ఆపరేషన్ పూర్తయినట్లు ప్రకటించారు. నవంబర్ 12న ప్రాజెక్ట్‌ను రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ప్రారంభించారు. ఆరెంజ్ లైన్‌లో భాగంగా జెడ్డా రోడ్ స్టేషన్, తువైక్ స్టేషన్, దౌహ్ స్టేషన్, హరున్ అల్-రషీద్ రోడ్ స్టేషన్, అల్-నసీమ్ స్టేషన్(ఇది ఆరెంజ్ లైన్, పర్పుల్ లైన్‌లను కలిపే ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లలో ఒకటి)ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని RCRC ఒక ప్రకటనలో తెలిపింది.
రియాద్ మెట్రో మిడిల్ ఈస్ట్ లో అతిపెద్దది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన డ్రైవర్‌లేని రైలు, ఆరు ప్రధాన లైన్‌ల విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. 176 కిలోమీటర్లు విస్తరణతో 4 ప్రధాన స్టేషన్‌లతో సహా 85 స్టేషన్‌లను కలుపుతుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







