ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లో అరుదైన స్పెసీస్ ల గుర్తింపు..!!
- January 07, 2025
ఇబ్రా: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని ఎన్విరాన్‌మెంట్ అథారిటీ ఏడు జాతుల అడవి సరీసృపాలను(స్పెసీస్) గుర్తించింది. పర్వత ప్రాంతాలు, వాడీలలో సరీసృపాల ఆనవాళ్లను గుర్తించినట్టు తెలిపింది. కొన్ని జాతుల సరీసృపాలు ఎడారులలో ప్రత్యేకంగా మనుగడ సాగిస్తున్నట్లు తెలిపారు. వాటి మనుగడపై అధిక ఉష్ణోగ్రతలు, కరువు పరిస్థితులు వంటి పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఎన్విరాన్‌మెంట్ అథారిటీ జారీ చేసిన అట్లాస్ ఆఫ్ ఒమన్ వైల్డ్ సరీసృపాలు, ఒమన్ సుల్తానేట్‌లో 101 కంటే ఎక్కువ రకాల సరీసృపాలను నమోదు చేసింది. అరేబియా ద్వీపకల్పంలో 21 జాతుల పాములు, 80 జాతుల బల్లులతో సహా మొత్తం జాతుల సరీసృపాలలో 50% ఉన్నాయని తెలిపారు. ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్ పర్వత, ఎడారి ప్రాంతాలు, సాదా భూములు, వాడీలు వివిధ జాతుల అడవి సరీసృపాల ఉనికికి అనువైనదిగా ఉందని పేర్కొంది.
నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లోని ఎన్విరాన్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ సైఫ్ అల్ బుసాఫీ మాట్లాడుతూ.. ఫీల్డ్ సర్వే గవర్నరేట్‌లోని మూడు విలాయాత్‌లను కవర్ చేసిందని, ఈ విలాయత్‌లలో GIS సాంకేతికతతో సర్వే జరిగిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







