మక్కా, మదీనా, జెద్దాలను ముంచెత్తిన భారీ వర్షాలు..!!

- January 07, 2025 , by Maagulf
మక్కా, మదీనా, జెద్దాలను ముంచెత్తిన భారీ వర్షాలు..!!

జెడ్డా: మక్కా, మదీనా, జెద్దాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో మక్కా, జెడ్డా, మదీనా నగరాల్లోని రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. పర్యావరణం, నీరు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. ఇతర ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మదీనా ప్రాంతంలోని బదర్ గవర్నరేట్‌లోని అల్-షఫియాలో అత్యధికంగా 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జెద్దా నగరంలోని అల్-బసతీన్ జిల్లాలో 38 మిల్లీమీటర్లతో రెండవ అత్యధిక వర్షపాతం నమోదైంది. మదీనా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైందని మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది.

మదీనాలోని ప్రవక్త మసీదు వద్ద ఉన్న సెంట్రల్ హరామ్ ఏరియాలో 36.1 మిమీ, బదర్‌లోని అల్-మసీదులో 33.6 మిమీ, ఖుబా మసీదులో 28.4 మిమీ, సుల్తానా పరిసరాల్లో 26.8 మిమీ, అల్-సువైద్రియా, బదర్‌లలో 23.0 మిమీ వర్షపాతం నమోదైంది.

మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. జనవరి 7 వరకు మక్కా, మదీనా, ఖాసిం, తబుక్, ఉత్తర సరిహద్దులు, అల్-జౌఫ్ ప్రాంతాలలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.  మరోవైపు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) జెడ్డా నగరానికి హెచ్చరిక స్థాయిని రెడ్ నుండి ఆరెంజ్ కు తగ్గించినట్లు NCM ప్రతినిధి హుస్సేన్ అల్-ఖహ్తానీ తెలిపారు.   

జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, జెడ్డాలో వర్షపు పరిస్థితుల కారణంగా విమానాల షెడ్యూల్ అప్‌డేట్‌లను తరచూ తనిఖీ చేయాలని, విమానాశ్రయానికి వెళ్లే ముందు వారి సంబంధిత ఎయిర్ క్యారియర్‌లను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు.

 ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, విద్యుత్ సదుపాయాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. వర్షపు పరిస్థితుల ప్రభావాలకు సంబంధించిన ఏవైనా అత్యవసర కేసులను 940 నంబర్ ద్వారా లేదా బలాడి అప్లికేషన్ ద్వారా నివేదించాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com