ఇకపై వారికి నెలకు 2 లక్షల జీతం: ఏపీ ప్రభుత్వం

- January 11, 2025 , by Maagulf
ఇకపై వారికి నెలకు 2 లక్షల జీతం: ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కేబినెట్ హోదా ఉన్నవారికి నెలకు రెండు లక్షల జీతం అందించేందుకు చంద్రబాబు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. జీతంతో పాటు కార్యాలయ ఫర్నిచర్ ఏర్పాటుకు వన్ టైం గ్రాంట్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. అంతేకాక..వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్లు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. అంటే కేబినేటర్ ర్యాంకు ఉన్నవారికి నెలకు మొత్తం 4.50 లక్షలు అందబోతున్నాయన్నమాట. దీంతో కేబినెట్ ర్యాంకు ఉన్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిర్ణయం వలన క్యాబినెట్ హోదా ఉన్న అధికారుల పనితీరు మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధమైన జీతాలు, సౌకర్యాలు అందించడం అధికారులకు ప్రోత్సాహకంగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఇది వారి బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సహాయపడుతుందని పేర్కొంటున్నారు. అయితే, ఈ నిర్ణయంపై విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, క్యాబినెట్ హోదా కలిగిన వారికి అధిక మొత్తంలో జీతాలు, సౌకర్యాలు కల్పించడం ప్రజాధనం అనవసరంగా వ్యయమవుతుందని కొందరు విమర్శిస్తున్నారు. సామాన్య ప్రజల సమస్యలపై మరింత శ్రద్ధ పెట్టకుండా, ఈ విధమైన ఆర్థిక ప్రయోజనాలు కేటాయించడం అనుచితమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుందో వేచిచూడాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com