ఇండియన్ ఆర్మీ డే ..!
- January 15, 2025
దేశానికి తిండి పెట్టేవాడు రైతన్న అయితే.. దేశానికి, దేశ ప్రజలకు రక్షణ ఇస్తూ దేశ ప్రజలు అందరూ ప్రశాంతంగా నిద్రపోవడానికి కారణం అవుతున్నది సైనికులు. దేశాన్ని రక్షించే వీర సైనికుల ధైర్యం, అంకితభావం, వారు చేసే త్యాగాలు వెలకట్టలేనివి. ఇలాంటి వీర సైనికులను గౌరవించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన ఇండియన్ ఆర్మీ డే లేదా ఇండియన్ సోల్జర్ డే జరుపుకుంటారు. దేశ సరిహద్దులలో శాంతి భద్రతలను కాపాడటంలోనూ, సంక్షోభాల సమయంలో అపన్న హస్తం అందించడంలోనూ దేశ సైన్యం చేసే కృషి మాటల్లో వర్ణించలేనిది.
భారత సైన్యం 1776లో మొట్టమొదటి సారిగా బ్రిటీషు వారి పాలనలో ఏర్పాటైంది. అప్పుడు భారత సైన్యం బ్రిటీషు సైన్యంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఆ తరువాత 1895లో భారత సైన్యం 'బ్రిటీష్ భారతీయ సేన'(బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ)గా రూపాంతరం చెందింది. సైన్యంలో సీనియర్ అధికారులు బ్రిటిష్ వారుగా ఉన్న సమయం అది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా సైన్యంలో సీనియర్ అధికారులు ఉన్నారు. అతను బ్రిటిష్ మూలానికి చెందినవాడు. 1949లో జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ చివరి బ్రిటిష్ కమాండర్. ఆయన పదవి నుంచి వైదొలిగిన తర్వాత, లెఫ్టినెంట్ జనరల్ కె.ఎం. కరియప్ప స్వతంత్ర భారతదేశానికి మొదటి భారతీయ సైనిక అధికారి అయ్యారు.
బ్రిటిష్ సైన్యాధికారి జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప జనవరి 15వ తేదీన భారత సైన్యం కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో ఈరోజున (జనవరి 15) ప్రతి ఏటా భారత సైనిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించిన చివరి బ్రిటిష్ సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్. ఆ సమయంలో ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప లెఫ్టినెంట్ జనరల్‌గా ఉన్నారు. భారతీయుడిగా బ్రిటిష్ సైన్యంలో తీవ్ర వివక్షతను ఎదుర్కొన్న కరియప్ప..భారత సైన్యంలోని ప్రాంతీయ భావాలను రూపుమాపి ‘జైహింద్’ నినాదాన్ని తీసుకుని వచ్చారు. జై హింద్ అంటే భారత్ విజయం అని అర్థం.
ఈ రోజున ఇండియా గేట్ వద్ద, అమర్ జవాన్ జ్యోతి మరియు అన్ని సైనిక కార్యాలయాల వద్ద ప్రధాన కార్యాలయంలో భారత సైనిక దినోత్సవం జరుగుతుంది. భారత సైన్యం మొత్తానికి సైనిక దినోత్సవం ఒక ముఖ్యమైన రోజు. ఎంతోమంది దేశాన్ని కాపాడేందుకు సైనికులతో పోరాడి.. జీవితాలను త్యాగం చేసిన వీరులైన సైనికులను నాడు అభినందిస్తారు.
- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







