ఇండోర్‌లోనే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం
- January 18, 2025
న్యూయార్క్: ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం ఇండోర్‌లో జరగనుంది. వాషింగ్టన్ డీసీలో విపరీతమైన చలి ఉండటంతో క్యాపిటోల్ భవనంలో ప్రమాణం చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో అతిథులను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పారు. కాగా అర్కిటిక్ బ్లాస్ట్ వల్ల వాషింగ్టన్ డీసీలో 20న -12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు డొనాల్డ్ ట్రంప్-జేడీ వాన్స్ ఇనాగ్యురల్ కమిటీ ఆహ్వాన పత్రికలను పంపించింది. భారత్ సహా జీ20, బ్రిక్స్ ప్లస్.. వంటి అత్యున్నత గ్రూప్‌లల్లో సభ్య దేశాలకూ ఈ ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అందాయి. ఇంకో రెండు రోజుల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభం కావాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. వేదికను మార్చుకున్నారు. అవుట్ డోర్ నుంచి ఇండోర్‌లోకి మారిందీ కార్యక్రమం. సాధారణంగా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం అవుట్ డోర్‌లో ఏర్పాటవుతుంటుంది. రాజధాని వాషింగ్టన్ డీసీలోని వెస్ట్ ఫ్రంట్ దీనికి వేదిక అవుతుంటుంది. 2020లో కూడా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇక్కడి నుంచే ప్రమాణం చేశారు.
వందలాది మంది పోలీసులు, భద్రత సిబ్బంది. సంప్రదాయబద్ధంగా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో వినియోగించే గుర్రాలు, ప్రమా స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి వచ్చే మద్దతుదారులు, సాధారణ ప్రజలు.. గంటల కొద్దీ చలిలో గడపాల్సిన పరిస్థితులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో వేదికను కేపిటల్ వన్ ఎరినా రొటుండాలోకి మార్చుకున్నానని ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్షుడి ప్రమాణ స్వీకార వేదిక మారడం ఆ దేశ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. 1985లో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఇనాగ్యురల్ సెరిమని కూడా కేపిటల్ రొటుండాలో చోటు చేసుకుంది. అప్పట్లో కూడా చలి తీవ్రతే కారణం.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్‌లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్‌లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ వార్..ముడి చమురు ధరలకు రెక్కలు!