బహ్రెయిన్ లో విదేశీ వ్యాపార లైసెన్స్‌లపై కఠిన నియంత్రణలా?

- January 18, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో విదేశీ వ్యాపార లైసెన్స్‌లపై కఠిన నియంత్రణలా?

మనామా: విదేశీ సంస్థలకు వ్యాపార లైసెన్స్‌లు, బ్రాంచ్ అనుమతుల జారీకి సంబంధించి కఠినమైన నిబంధనల కోసం పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. బహ్రెయిన్ మార్కెట్‌లో విదేశీ వ్యాపారాల ద్వారా ఎదురవుతున్న పోటీపై ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీలు జలీలా అల్ సయ్యద్, డాక్టర్ హేషమ్ అల్ అషీరీ, మొహసేన్ అల్ అస్బోల్, హసన్ బుక్‌మాస్, హసన్ ఇబ్రహీం ఈ మేరకు ప్రతిపాదన చేశారు.  ఎంపి అహ్మద్ అల్ సలూమ్ అధ్యక్షతన ప్రతినిధుల సభ..స్థానిక వ్యాపారాలు, బహ్రెయిన్ పౌరులకు ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే విదేశీ సంస్థల నుండి పెరుగుతున్న పోటీని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపింది.  ప్రత్యేకించి, విదేశీ వ్యాపారాలకు లైసెన్సులు మంజూరు చేసే సమయంలో కఠినమైన పర్యవేక్షణ, నియంత్రణలను అమలు చేయాలని పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వ శాఖను కమిటీ కోరింది.

పరిశ్రమ, వాణిజ్య మంత్రి అబ్దుల్లా ఫఖ్రో గత సంవత్సరం ప్రారంభంలో ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ.. 83వేల యాక్టివ్ నమోదిత వ్యాపారాలలో సుమారు 16% పూర్తిగా బహ్రైన్‌యేతరుల యాజమాన్యంలో ఉన్నాయని, ఇది దాదాపు 13,000 విదేశీ- యాజమాన్యంలోని సంస్థలు అని పేర్కొన్నారు. బహ్రెయిన్‌లో 70వేలకు పైగా నమోదిత వ్యాపారాలు కనీసం ఒక బహ్రెయిన్ భాగస్వామిని కలిగి ఉన్నాయని, వ్యాపార వాతావరణం సహకార స్వభావాన్ని వారు చాటిచెప్పారని ఆయన హైలైట్ చేశారు. ఫిబ్రవరి 2024 మధ్య నాటికి మొత్తం 83,877 యాక్టివ్ బిజినెస్ లైసెన్స్‌లు, 2,911 ఇన్‌యాక్టివ్ కాని లైసెన్స్ ఉన్న వ్యాపారాలు ఉన్నాయని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com