దుబాయ్ మెట్రో విస్తరణ: 2016 చివర్లో ప్రారంభం
- June 30, 2016
2020 రూట్లో దుబాయ్ మెట్రో విస్తరణ కార్యకలాపాలు 2016 చివరి నాటికి ప్రారంభం కానున్నాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెల్లడించింది. 10.6 బిలియన్ దిర్హామ్‌లకు కాంట్రాక్టును అప్పగించారు. ఎక్స్పోలింగ్ కన్సార్టియమ్ ఈ పనులు చేపడుతుంది. ఫ్రెంచ్ సంస్థ అల్స్టారమ్మ్, స్పెయిన్‌కి చెందిన అసియోనా, టర్కీ కంపెని గులెర్మాక్ సంస్థలు ఈ కన్సార్టియమ్లో ఉంటాయి. 2019 నాటికి 15 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. 2020 ఎక్స్పోకి ఐదు నెలల ముందుగా మెట్రో అందుబాటులోకి వస్తుంది. ఈ మార్గంలో మూడు స్టేషన్లు ఎలివేటెడ్ పద్ధతిలో, రెండు అండర్‌గ్రౌండ్‌లో నిర్మితమవుతాయి. ఆర్టిఎ వివరాల ప్రకారం 11.8 కిలోమీటర్ల రూట్ ఎలివేటెడ్ పద్ధతిలో ఉంటే, 3.2 కిలోమీటర్ల రూట్ అండర్‌గ్రౌండ్‌లో ఉంటుంది. డిస్కవరీ గార్డెన్స్, అల్ ఫర్జన్, జెమురైఆ గోల్డ్ ఎస్టేట్స్, దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌ల మీదుగా ఈ అండర్ గ్రౌండ్ రూట్ వెళుతుంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







