కువైట్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం..!!
- January 27, 2025
కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైక ఉదయం 9:00 గంటలకు త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, భారత రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. అంతకుముందు రాయబారి కార్యాలయం ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశం - కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని గుర్తుచేశారు. భారత పౌరుల కోసం సేవలు అందుబాటులో ఉన్నాయని, 24 గంటల పాటు అందుబాటులో ఉండే వాట్సాప్ నంబర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే వీక్లీ పబ్లిక్ మీటింగ్ లో తా వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటానని రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా అన్నారు. " ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి కువైట్ పర్యటన ఇండో-కువైట్ సంబంధాన్ని కొత్త స్థాయికి పెంచింది. రాబోయే సంవత్సరాల్లో ఈ బంధం మెరుగైన ఫలితాన్ని చూస్తాము." అని రాయబారి చెప్పారు. అనంతరం భారతీయ సంఘం సభ్యులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఇందులో కమ్యూనిటీ సభ్యులచే దేశభక్తి గీతం, న్యూ గల్ఫ్ ఇండియన్ స్కూల్, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, ICSK అమ్మన్, భవన్స్ రిథంస్కేప్, తాల్ డ్యాన్స్ అకాడమీ, ప్రణవం నాట్యలే విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. దౌత్య ప్రాంతం వద్ద భద్రతా పరిమితిని కఠినంగా అమలు చేయడం వలన, దౌత్య కార్యాలయం సమీపంలోని పార్కింగ్ ప్రదేశాల నుండి ఎంబసీకి ఉచిత షటిల్ సేవను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







