కిడ్నీ సమస్యలు అడ్డుకునే ఆసనాలివి..
- June 30, 2016
కిడ్నీ సమస్యలు రాకుండా..
ఎక్కువ కొవ్వులూ, పిండిపదార్థాలున్న ఆహారం తీసుకోవడం, నిద్రా, విశ్రాంతి తక్కువైన జీవనశైలి.. మన మూత్రపిండాలపై భారం మోపుతున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యని అడ్డుకునే ఆసనాలివి..
మకర ముద్ర: ఎడమచేయి బొటనవేలూ, ఉంగరం వేలిని కలిపి ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా చాపి ఉంచాలి. కుడిచేతి బొటనవేలిని ఎడమ చిటికెన వేలికీ, ఉంగరం వేలికీ మధ్యలో ఉంచాలి. ఇలా ఐదునిమిషాల పాటూ ఉంచాలి. కిడ్నీ సమస్యలున్నవారు దీన్ని మూడుపూటలా చేస్తే మంచిది.
ఉష్ట్రాసనం: రెండు కాళ్లూ వెనక్కిపెట్టి వజ్రాసనంలో కూర్చుని.. మోకాళ్లమీద లేవాలి. ఇలా లేచినప్పుడు రెండు మోకాళ్ల మధ్య కాస్త ఎడం ఉండాలి. మెల్లగా వెనక్కి వంగుతూ రెండు చేతులతో రెండు కాళ్లూ పట్టుకోవాలి. తలని పూర్తిగా వెనక్కి వంచాలి. నడుము కాస్త ముందుకు ఉండాలి. ఈ ఆసనంలో శ్వాస మామూలుగా తీసుకుని వదలాలి. అరనిమిషంపాటూ ఇలా ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. ఇలా చేయడం రాకపోతే రెండుచేతులతో కాకుండా ముందుగా ఒక చేత్తో సాధన చేయొచ్చు. తర్వాత మరొక చేత్తో చేయొచ్చు. ఈ ఆసనం వల్ల మూత్రపిండాలకు సరైన రక్తప్రసరణ అంది సమస్యలు తొలగిపోతాయి. నడుము నొప్పి ఉన్నవారికి కూడా ఇది మంచిది.
ధనురాసనం: బోర్లాపడుకుని రెండు కాళ్లూ మడిచి మెల్లగా కుడిచేత్తో కుడికాలి మడమనీ ఎడమచేత్తో ఎడమకాలి మడమని పట్టుకుని తలనీ, భుజాలనీ పైకి లేపాలి. అప్పుడు శరీర బరువంతా పొట్టమీద పడుతుంది. ఈ ఆసనంలో ఇరవై సెకన్లపాటూ ఉండి యథాస్థితికి రావాలి. ఇలా మూడు సార్లు చేయాలి. కిడ్నీ ఇన్‌ఫెక్షన్లు ఉంటే తొలగిపోతాయి.
భుజంగాసనం: బోర్లాపడుకుని రెండు అరచేతులనీ ఒకదానితో ఒకటి కలిపి దానిపై నుదుటిని ఉంచాలి. శ్వాస తీసుకుంటూ తలనిపైకెత్తి చూడాలి. శ్వాస వదులుతూ తిరిగి నుదుటిని చేతులపై ఉంచాలి. ఇలా ఆరు సార్లు చేయాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







