తిరుమలలో ఫిబ్రవరి 4న రథ సప్తమి వేడుకలు..

- January 30, 2025 , by Maagulf
తిరుమలలో ఫిబ్రవరి 4న రథ సప్తమి వేడుకలు..

తిరుమల: రథసప్తమి వేడుకలకు తిరుమల సిద్ధమైంది. రథసప్తమిని పురస్కరించుకుని ఫిబ్రవరి 4న స్వామివారు సప్త వాహనాలపై మాడవీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. వాహన సేవలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసిలాట ఘటనతో టీటీడీ అప్రమత్తమైంది.రథసప్తమి వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

రథసప్తమి రోజున స్వామివారు సప్త వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజులు పాటు జరిగే వాన సేవలు దాదాపుగా ఈ ఒక్కరోజే ఏడు వాహనాలు భక్తులకు కనువిందు చేస్తాయి.అందుకే రథసప్తమి పర్వదినాన్ని ఒకరోజు బ్రహ్మోత్సవంగా కూడా వ్యవహరిస్తారు.

రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు. వాహన సేవలు వీక్షించడానికి మాడవీధుల్లే వేచి ఉండే భక్తులకు ఎండ వేడిమి తగలకుండా చలువ పందిళ్లు వేశారు.అదేవిధంగా మాడవీధుల్లోకి వెళ్లే ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను సిద్ధం చేశారు.టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ ఇంచార్జ్ సివీఎస్ఓ మణికంఠ తదితర అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రథసప్తమి రోజున ముందుగా ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంపై స్వామివారి భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి ఏర్పాట్లను సమీక్షించేందుకు టీటీడీ బోర్డు రేపు అత్యవసరంగా సమావేశం కానుంది.

స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు
తిరుమలలో భక్తులకు కల్పించే సౌకర్యాల పై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జే.శ్యామలరావు అధికారులకు కీలక సూచనలు చేస్తున్నారు.ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీని రద్దు చేశారు. ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలతో పాటు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనలను రద్దు చేశారు. ఆ రోజున నేరుగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శనం కల్పిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com