యూఏఈలో కంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లూయెన్సర్లకు గోల్డెన్ వీసాలు..!!
- February 02, 2025
యూఏఈ: కంటెంట్ సృష్టికర్తలకు యూఏఈ స్వాగతం పలుకుతోంది. వారికి గోల్డెన్ వీసాల కింద 10 ఏళ్ల రెసిడెన్సీని ఆఫర్ చేస్తుంది. క్రియేటర్స్ హెచ్క్యూ అనే ప్రోగ్రామ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, పాడ్కాస్టర్లు, విజువల్ ఆర్టిస్టులతో సహా విభిన్న ప్రతిభను ప్రోత్సహించనుంది. మార్కెటింగ్ సంస్థలు, మీడియా, సంగీత నిర్మాతలు, యానిమేషన్ స్టూడియోలు, ఫ్యాషన్ వంటి సృజనాత్మక ఇండస్ట్రీలో ప్రతిభగల వారిని ఆకర్షించడమే ప్రోగ్రామ్ లక్ష్యమని క్యాబినెట్ వ్యవహారాల మంత్రి మొహమ్మద్ అల్ గెర్గావి తెలిపారు. యూఏఈ గోల్డెన్ వీసా వ్యక్తులు వీసా పునరుద్ధరణ లేదా స్పాన్సర్ అవసరం లేకుండా పది సంవత్సరాల పాటు దేశంలో నివసించడానికి అనుమతిస్తుంది. ఇది పొందిన కంటెంట్ క్రియేటర్స్ కు దీర్ఘకాలిక నివాసాన్ని అందిస్తుంది. ఫిల్మ్ మేకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , డిజిటల్ స్టోరీటెల్లర్ అయినా ఈ వీసాతో ప్రయోజనం పొందవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
అప్లికేషన్ ఫారమ్ను పూర్తి చేయడం ద్వారా కంటెంట్ సృష్టికర్తలు క్రియేటర్స్ హెచ్క్యూ వెబ్సైట్ ద్వారా గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. HQలోని బృందం గోల్డెన్ వీసా ప్రమాణాల ప్రకారం.. కంటెంట్ క్రియేటర్లు, క్రియేటివ్ టాలెంట్ కేటగిరీ కింద అభ్యర్థి అర్హతను ఆమోదిస్తుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష