ఐసీసీలో క్రికెట్ కమిటీ పదవికి రాజీనామా చేసిన రవిశాస్త్రి
- July 01, 2016
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, టీమ్ ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి ఐసీసీలోని ఉన్నత పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఐసీసీలో మీడియా విభాగ అధికార ప్రతినిధిగా ఉన్నారు. భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవి కోసం ఆయనను ఇంటర్వ్యూ చేసిన బృందంలో గంగూలీ లేకపోవడాన్ని రవిశాస్త్రి తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గంగూలీ-రవిశాస్త్రిల మధ్య మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో శాస్త్రి రాజీనామా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
'నేను ఇప్పటికే ఐసీసీకి రాజీనామా సమర్పించాను. ఆరేళ్ల నుంచి నేను ఆ పదవిలో కొనసాగుతున్నాను. రాజీనామా పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం' అని రవిశాస్త్రి స్పష్టం చేశారు. అయితే ఆయన ఇప్పటికే వ్యాఖ్యతగా, క్రికెట్ నిపుణుడిగా, కాలమిస్ట్‌గా వివిధ పాత్రలు పోషిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. దీంతో ఐసీసీ పదవికి రాజీనామా చేయాలని రవిశాస్త్రి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







