గులాబీ పువ్వులతో బరువు తగ్గవచ్చు... !

- February 09, 2025 , by Maagulf
గులాబీ పువ్వులతో బరువు తగ్గవచ్చు... !

 గులాబీ పువ్వును ప్రేమకు చిహ్నంగా భావిస్తారు.గులాబీ పువ్వు ప్రేమ, అందానికి మాత్రమే చిహ్నం కాదు. ఇందులో అనేక అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.గులాబీ పువ్వుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. గులాబీ పువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వీటిని ఉపయోగించడం వల్ల చర్మపు మచ్చలు, బరువు తగ్గడం, మొటిమలు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి. గులాబీ పువ్వు ప్రయోజనాలు, ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

మొటిమల సమస్యను తొలగించడంలో గులాబీ పువ్వు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమల్ని తగ్గించడంలో సాయపడతాయి. ఇందుకోసం కొన్ని మెంతుల్ని వేయించండి.ఆ తర్వాత రోజ్ వాటర్ సాయంతో పేస్ట్‌లా తయారు చేసుకోండి.ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేయాలి. ముఖానికి అప్లై చేసిన తర్వాత 20 నిమిషాలు అలాగే ఉంచండి.ఆ తర్వాత ముఖాన్ని చల్లని వాటర్‌తో కడుక్కోండి. వారానికి కనీసం రెండు సార్లు అయినా ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బరువు తగ్గడంలో గులాబీ పువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుందని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే.బరువు తగ్గడం కోసం 10 నుంచి 15 గులాబీ రేకులను నీటిలో వేసి నానబెట్టండి.ఆ తర్వాత నీరు పూర్తిగా గులాబీ రంగులోకి మారినప్పుడు దానికి ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ నీటిని తాగాలి.ఇలా ఒక నెల రోజుల పాటు గులాబీ నీరు తాగడం వల్ల మీరు తేడాను గమనిస్తారు.


గులాబీ పువ్వుల్లో మానసిక స్థితిని, ఒత్తిడిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది వర్క్ లైఫ్‌స్టైల్ కారణంగా ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి గులాబీ పువ్వులు బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం గులాబీ రేకుల్ని ఓ 15 తీసుకోండి. ఆ తర్వాత వీటిని గులాబీ రేకుల్ని నీటిలో బాగా మరగించండి. ఆ తర్వాత గులాబీ రేకుల నీటి ఆవిరిని పీల్చడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

గులాబీ రేకులు తినడం వల్ల జీర్ణక్రియ మెరగవుతుంది. జీర్ణసమస్యలు ఉన్నవారి ఇది బెస్ట్ ఆప్షన్. గులాబీ రేకులు తినడం వల్ల పేగుల కదలికలు వేగవంతం అవుతాయి. పేగులు ఉత్తేజపడి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం గులాబీ రేకుల్ని శుభ్రపరిచి నేరుగా తినవచ్చు. లేదంటే 10 నుంచి 15 గులాబీ రేకులను నీటిలో వేసి నానబెట్టండి. ఆ తర్వాత నీరు పూర్తిగా గులాబీ రంగులోకి మారినప్పుడు దానికి ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఈ నీటిని రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ మెరగవుతుంది.

 కాలుష్యం కారణంగా  కాలుష్యం కారణంగా చాలా మంది చిన్న వయసులోనే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖంపై మొడతలు వస్తున్నాయి. అయితే, రోజూ నిద్రపోయే ముందు రోజ్ వాటర్‌ను నాభిపై అప్లై చేయడం వల్ల ముఖంపై వచ్చే ముడతల సమస్య తొలగిపోతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. రోజ్ వాటర్ ఫైన్ లైన్స్ నుంచి ఉపశమనం అందించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

  --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com