వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్

- February 13, 2025 , by Maagulf
వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్

హైదరాబాద్: హైదరాబాద్ హిమాయత్‌నగర్‌ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని చేధించారు పోలీసులు. 24 గంటల్లోనే చోరీకి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం చేసింది ఎవరో తెలిసి పోలీసులతో పాటు వ్యాపారి కూడా షాక్ కి గురయ్యారు.తన కూతురు పెళ్లి పనుల్లో సాయంగా ఉంటారని పనికి పిలిపించిన వ్యక్తులే ఈ భారీ చోరీ చేసినట్లు తెలుసుకుని ఆ వ్యాపారి కంగుతిన్నాడు.

రెండు రోజుల క్రితం నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రముఖ ఆయిల్‌ వ్యాపారి రోహిత్‌ కేడియా ఇంట్లో భారీ చోరీ జరిగింది.కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలు, నగదు చోరీ అయ్యాయి.ఈ భారీ దొంగతనం సంచలనం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు..గంటల వ్యవధిలోనే చేధించారు.కేసు వివరాలను నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

కేడియా గ్రూప్‌ సంస్థ అధినేత రోహిత్‌ కేడియా హిమాయత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆయన కూతురి పెళ్లి నిశ్చయం అయ్యింది.ఇందులో భాగంగా 5 రోజుల క్రితం వ్యాపారి, ఆయన కుటుంబసభ్యులు దుబాయ్ వెళ్లారు. ఈ నెల 11వ తేదీన రోహిత్‌ కేడియా సంస్థలో పని చేస్తున్న వ్యక్తి తన యజమాని ఇంటికి వెళ్లాడు. అక్కడ తాళాలు పగలగొట్టి ఉండటం చూసి షాక్ తిన్నాడు. కంగారుగా లోపలికి వెళ్లి చూసి విస్తుపోయాడు.

అల్మారా ఓపెన్ చేసి ఉంది. అందులో ఉండాల్సిన ఖరీదైన బంగారు ఆభరణాలు, క్యాష్ కనిపించలేదు. ఆందోళనకు గురైన అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. సుమారు రూ.3 కోట్ల విలువైన సొత్తు మాయమైందని విచారణలో తెలిసింది.

ఈ కేసుని చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీని జల్లెడ పట్టారు. ఈ క్రమంలో దొంగలు ఎవరో తెలిసిపోయింది. చోరీకి పాల్పడింది.. ఇంట్లో పని మనుషులే అని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు. పెళ్లి పనుల్లో సాయంగా ఉంటారని పిలిస్తే.. ఏకంగా ఆ ఇంట్లోనే చోరీకి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు బీహార్ వాసులు. ఒకరు వెస్ట్ బెంగాల్ కు చెందిన వారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com