ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పరీక్షించిన సీపీ సుధీర్ బాబు
- February 14, 2025
హైదరాబాద్: నేడు మరియు రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న పదకొండవ ఎడిషన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2025 టీ20 మ్యాచ్ ల సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, వివిధ భాషల సినిమా తారలు పాల్గొనే సెలబ్రిటీ క్రికెట్ పోటీలు కావటం వల్ల భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.ద్విచక్ర వాహనాలు మరియు కార్లకు విశాల ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా పరిసరాల శుభ్రతకు సంబంధించిన కేంద్రప్రభుత్వ స్వచ్ఛభారత్ పథకం ను ప్రమోట్ చేస్తూ ఏర్పాటు చేసిన హోర్డింగ్ మీద సీపీ సంతకం చేశారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







