అయోధ్యలోని రామాలయం సరికొత్త రికార్డ్
- February 17, 2025
అయోధ్య: అయోధ్యలోని రామాలయం సరికొత్త రికార్డ్ సృష్టించింది.ఆలయానికి కళ్లు చెదిరే రీతిలో ఆదాయం వస్తోంది. వార్షిక ఆదాయం 700 కోట్ల రూపాయలు దాటింది.అలా.. వార్షిక ఆదాయంపరంగా దేశంలోనే మూడో పెద్ద ఆలయంగా అయోధ్య రామ మందిరం నిలిచింది. వార్షిక ఆదాయంలో స్వర్ణ దేవాలయం, శ్రీమాతా వైష్ణోదేవి, షిర్డీసాయిబాబా ఆలయాలను బాల రామయ్య ఆలయం వెనక్కి నెట్టింది.రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన నాటి నుంచి 13 కోట్ల మందికిపైగా భక్తులు, పర్యాటకులు రామాలయాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
అయోధ్యకు భక్తులు, పర్యాటకులు పోటెత్తుతున్నారు. భక్తులు, పర్యాటకుల సంఖ్య 2 నుంచి 5 లక్షలుగా ఉంటోంది. భక్తులు నగదుతో పాటు బంగారం, వెండిని సైతం సమర్పించుకుంటున్నారు. 2024 జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట వేడుక జరిగింది.
రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి అయోధ్యకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.దీనికి కుంభమేళా తోడైంది. ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానం ఆచరించిన భక్తులు అటు నుంచి అయోధ్య వెళ్తున్నారు. అలా ప్రతిరోజూ 4 లక్షల మంది వరకు రాముడిని దర్శించుకుంటున్నారు. మహాకుంభమేళా జరుగుతున్న నెలలోనే.. రూ.15కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు.
అధికారుల లెక్కల ప్రకారం.. 2024-25 సంవత్సరంలో తిరుమల వెంకన్న ఆలయం వార్షిక విరాళాల మొత్తం సుమారు రూ.1500 నుంచి రూ.1650 కోట్లుగా అంచనా.ఇక, కేరళ తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయం సెకండ్ ప్లేస్ లో ఉంది.ఈ ఆలయం వార్షిక ఆదాయం రూ.750 నుంచి రూ.850 కోట్లుగా అంచనా.
దేశంలోని అత్యధిక ఆదాయం వచ్చే ఆలయాల జాబితాలో తిరుమల ఆలయం (రూ.1500-రూ.1650 కోట్లు) తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం (రూ.750-850 కోట్లు) రెండో ప్లేస్ లో ఉంది.
పంజాబ్‌లోని స్వర్ణదేవాలయానికి రూ.650కోట్లు, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి రూ.600కోట్లు, మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి రూ.500కోట్లు, ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయానికి రూ.400 కోట్లు, ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్‌కు రూ.200-250 కోట్లు, గుజరాత్ సోమ్‌నాథ్ ఆలయానికి రూ.150-200కోట్ల ఆదాయం వస్తున్నట్లు అంచనా.
దేశంలోనే అత్యధిక ఆదాయం వస్తున్న ఆలయాలు..
- తిరుమల వెంకన్న ఆలయం–ఆంధ్రప్రదేశ్–1500-1650 కోట్లు
- పద్మనాభ స్వామి ఆలయం–కేరళ–750-800 కోట్లు
- స్వర్ణదేవాలయం–పంజాబ్–650 కోట్లు
- వైష్ణోదేవి ఆలయం–జమ్ముకశ్మీర్–600 కోట్లు
- శిర్డీసాయి ఆలయం-మహారాష్ట్ర–500 కోట్లు
- పూరీ జగన్నాథ్ ఆలయం–ఒడిశా–400 కోట్లు
- అక్షర్ ధామ్ ఆలయం–ఢిల్లీ–200–250 కోట్లు
- సోమ్ నాథ్ ఆలయం–గుజరాత్–150-200 కోట్లు
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







