కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్
- February 18, 2025
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ను నియమించింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దీనిపై కీలక ప్రకటన విడుదల చేసింది.
భారత ప్రధాన ఎన్నికల కమిషన్ పేరును ఖరారు చేయడానికి సెలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ప్రధాన మంత్రి మోదీతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా సి ఈ సీ ని ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్యానెల్‌లో సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ సౌత్ బ్లాక్‌లోని ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశమై, జ్ఞానేష్ కుమార్ పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ పేరును ఆమోదించారు. ప్రస్తుత క్ ఈ సీ పదవీ విరమణ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. రాజీవ్ కుమార్ రేపు పదవీ విరమణ చేయనున్నారు
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







