తెలంగాణలో ఇసుక డోర్ డెలివరీ..

- February 18, 2025 , by Maagulf
తెలంగాణలో ఇసుక డోర్ డెలివరీ..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుకను నేరుగా డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక యాప్ ను రూపొందిస్తుంది. వచ్చే 45 రోజుల్లోపు ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలను జరుగుతున్నాయి.ఈ యాప్ అందుబాటులోకి వస్తే..ఇంటి అవసరాల కోసం ఎవరైతే ఇసుకను ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటారో వారి ప్రాంతానికే నేరుగా నిర్దేశించిన ఇసుక లారీ లోడ్ వెళ్లనుంది.

మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ఇసుక డోర్ డెలివరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అవసరం ఉన్న ఎవరైనా సరే ఇతరులపై ఆధారపడకుండా నేరుగా ఇసుకను బుక్ చేసుకునేలా కొత్తగా రూపొందుతున్న యాప్ పనిచేస్తుందని చెప్పారు. ఇందులో ట్రాన్స్ పోర్ట్ వాళ్లను కూడా భాగస్వాములుగా చేయడం జరుగుతుందని, కిలో మీటరుకు ఇంత చొప్పున అని రేటు ఫిక్స్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఇసుకకు టన్నుకు రూ.405 ఉంది.. ట్రాన్స్ పోర్ట్ చార్జీలు కలిపితే టన్నుకు రూ.1600 లోపే ఉండాలి.. ఇంతకంటే ఎక్కువ ధర ఎవరూ చెల్లించొద్దని శ్రీధర్ సూచించారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లయితే సమాచారం ఇచ్చేందుకు 98480 94373, 70939 14343 ఏర్పాట్లు చేశామని చెప్పారు.

రాష్ట్రంలో ఇసుక పుష్కలంగా ఉంది.. కొరలేదని మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ చెప్పారు. ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. అంతేకాక ప్రతీరోజూ 75వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీస్తున్నాం. అందులో ఇప్పుడు 50వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. అయితే, ఇసుక లోడింగ్ ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఉంటుందని, తెలంగాణ ఆరు జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఎక్కువగా ఇసుక వస్తుందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com