సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం: హోంమంత్రి అనిత
- February 21, 2025
అమరావతి: చిట్ ఫండ్ కంపెనీ పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. విజయవాడలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు,సాయి సాధన చిట్ ఫండ్ బాధితులతో కలిసి హోంమంత్రి అనితకు వినతిపత్రం అందించారు.చిట్ ఫండ్ మోసంలో సుమారు రూ.200 కోట్ల మేర ప్రజలు నష్టపోయారని ఎమ్మెల్యే తెలిపారు.బాధితుల్లో ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని..వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.స్పందించిన హోంమంత్రి అనిత..ఘటనలో నిందితుడ్ని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు.ఈ కేసులో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







