బహ్రెయిన్ లో ట్రేడ్‌మార్క్, పేటెంట్ల నమోదులో భారీగా పెరుగుదల..!!
- February 22, 2025
మనామా: బహ్రెయిన్ 2024లో 23,345 ట్రేడ్‌మార్క్ లావాదేవీలు, 1,923 పేటెంట్ ఫైలింగ్‌లను నమోదు చేసింది. ఇది మేధో సంపత్తి రిజిస్ట్రేషన్లలో స్థిరమైన పెరుగుదలను చూపుతోందని నిపుణులు పేర్కొన్నారు. ఫారిన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ డైరెక్టరేట్ నివేదిక 1,161 పారిశ్రామిక డిజైన్, మోడల్ లావాదేవీలను కూడా కలిగి ఉన్న గణాంకాలను వివరించింది. ఈ రిజిస్ట్రేషన్లు ఎంటర్ ప్రెన్యూర్లు, వ్యాపారాలు తమ హక్కులను కాపాడుకోవడానికి చట్టపరమైన మద్దతును అందిస్తాయి. ట్రేడ్‌మార్క్‌లు, పేటెంట్లు, ఇండస్ట్రియల్ డిజైన్లలో కార్యకలాపాల పెరుగుదలను ఈ సంఖ్యలు స్పష్టంచేస్తున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది. పెట్టుబడి ప్రవాహాన్ని, వ్యాపార పరగా పోటీని పదునుగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రక్రియను సజావుగా చేయడానికి వ్యవస్థలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







