300 కి.మీ. వేగంతో డ్రైవింగ్..పోలీసుల అదుపులో వాహనదారుడు..!!

- February 22, 2025 , by Maagulf
300 కి.మీ. వేగంతో డ్రైవింగ్..పోలీసుల అదుపులో వాహనదారుడు..!!

దుబాయ్: 304 కి.మీ.ల వేగంతో డ్రైవింగ్ చేసి, తన ప్రాణాలకు ముప్పు తెచ్చి, ఇతరుల భద్రతను పణంగా పెట్టినందుకు యువ వాహనదారుడిని దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా కార్లు, ట్రక్కుల మధ్య విన్యాసాలు చేస్తూ ఇతర వాహనదారుల ప్రాణాలను మరింత ప్రమాదానికి గురిచేస్తున్నట్లు కనిపించింది.  సదరు వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతడి వాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. జప్తు చేయబడిన వాహనాన్ని విడుదల చేయడానికి Dh50,000 వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని అధికారులు హెచ్చరించారు. రహదారి భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని, వేగ పరిమితులను పాటించాలని వాహనదారులను కోరారు.  

దుబాయ్‌లో అతి వేగంతో నడిపే వాహనదారులకు 12 బ్లాక్ పాయింట్లతో 2,000 దిర్హామ్‌ల వరకు జరిమానా విధించవచ్చు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com