అద్దె ప్రక్రియను 3 దశలకు తగ్గించిన షార్జా..!!

- February 24, 2025 , by Maagulf
అద్దె ప్రక్రియను 3 దశలకు తగ్గించిన షార్జా..!!

యూఏఈ: షార్జా తన అద్దె సేవలను ఏడు నుండి మూడు విధానాలకు తగ్గించడం ద్వారా సులభతరం చేసింది. తాజాగా ప్రారంభించిన కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్ సంబంధిత విభాగాల్లో దేనినైనా వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరాన్ని కూడా తొలగించింది.  ఎమిరేట్ రియల్ ఎస్టేట్ సేవలను క్రమబద్ధీకరించడానికి, సేవలను మెరుగుపరచడానికి రూపొందించిన ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ‘అకారి’ని ప్రారంభించింది. 

పైలట్ దశలో, 90 కంటే ఎక్కువ కంపెనీలు సిస్టమ్‌తో అనుసంధానం అయ్యాయి. 4,791 ఆస్తులు జాబితాను నమోదు చేశారు. ప్లాట్‌ఫారమ్ వినియోగం కోసం దాదాపు 100 శిక్షణా వర్క్‌షాప్‌లు నిర్వహించగా, 240 మంది ప్రత్యేక వినియోగదారులకు అవసరమైన నైపుణ్యాలను అందించారు.

షార్జా డిజిటల్ ప్లాట్‌ఫారమ్ క్రింద అకారీ సమగ్ర గేట్‌వేగా ఉండనుంది. నివాసితులు, వ్యాపారాలు రెండింటికీ మరింత సమర్థవంతమైన అనుభవాన్ని అందించడం ద్వారా రియల్ ఎస్టేట్ సేవలను డిజిటలైజ్ చేయడం, సరళీకృతం చేయడం దీని లక్ష్యమన్నారు. ప్లాట్‌ఫారమ్ షార్జాలో రియల్ ఎస్టేట్ అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని, దీనిని మరింత అందుబాటులోకి మరియు పారదర్శకంగా మారుస్తుందని భావిస్తున్నారు. వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు చెందిన 200 మంది నిపుణులు ఈ వేదికపైకి వచ్చి తమ సేవలను అందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com