భారత దేశంలో 7 వేల కోట్ల 'లులు' పెట్టుబడులు
- July 03, 2016
ఎఫ్‌డిఐ విషయంలో భారత ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాట్ల నేపథ్యంలో లులు గ్రూపు 7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని లులు గ్రూపు అధిపతి యూసుఫ్‌అలి చెప్పారు. హాస్పిటాలిటీ, రిటైల్ సెక్టార్‌లో ఈ పెట్టుబడులు పెట్టనున్నారు. కేరళలో 4,650 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో 1,000 కోట్లు, అలాగే తెలంగాణలో 1,410 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది లులు గ్రూపు. ఎన్‌డిఏ ప్రభుత్వం ఎఫ్‌డిఐల వెసులుబాటు కల్పించడంతో దేశంలోకి సుమారు 150 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రవాహం వస్తుందని లులు గ్రూపు అధిపతి అంచనా వేశారు. ఇదంతా కేవలం గల్ఫ్ కంట్రీల నుంచి వచ్చే పెట్టుబడుల అంచనాయేనని ఆయన అన్నారు. లులు గ్రూపు కొచ్చిలో ఐటి పార్క్‌ని 1,400 కోట్లతో ఏర్పాటు చేయనుంది. తిరువనంతపురంలో షాపింగ్ మాల్ మరియు ఫైవ్‌స్టార్ హోటల్‌ని నిర్మించనుంది 1,250 కోట్లతో. తెలంగాణలో 500 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, 900 కోట్లతో షాపింగ్ మాల్‌ని లులు గ్రూప్ ఏర్పాటు చేయనుంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







