దొంగతనం కేసులో ఐదుగురికి జైలు
- July 03, 2016
ఓ విల్లాలోకి అక్రమంగా ప్రవేశించి 945,000 దిర్హామ్‌ల నగదు, విలువైన వస్తువుల్ని దొంగతనం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులకు మూడేళ్ళ జైలు శిక్ష పడింది. చైనా నుంచి వచ్చిన ఈ పర్యాటకుల వయసు 24 నుంచి 37 ఏళ్ళు. ఉమ్ సకెమ్‌లో అర్థరాత్రి దొంగతనం చేశారు. జులై 2015లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఘటన సమయంలో తాము యూఏఈలో లేమని నిందితులు పేర్కొన్నారు. విల్లా ఓనర్ మాట్లాడుతూ, ఇంట్లోకి వెళ్ళే సరికి అంతా చిందరవందరగా కనిపించిందనీ, విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయని, నగదు సహా విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని చెప్పారు. విచారణలో భాగంగా పోలీసులు, దొంగతనానికి గురైన వస్తువుల్ని గుర్తించాలని కోరారని, తాను వెళ్ళి తన వస్తువుల్ని గుర్తించానని ఆయన అన్నారు. న్యాయస్థానం విధించిన శిక్షపై నిందితులు 10 రోజుల్లోగా అపీల్ చేసుకునే వీలుంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







