రమదాన్..BLS పాస్‌పోర్ట్ కేంద్రాల పని వేళల్లో మార్పులు..!!
- March 03, 2025
కువైట్: రమదాన్ సందర్భంగా పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ ధృవీకరణ కోసం BLS అవుట్సోర్సింగ్ కేంద్రాల పని వేళల్లో మార్పులు చేశారు. కువైట్ సిటీ, జలీబ్ అల్-షుయౌక్ (అబ్బాసియా), ఫహాహీల్, జహ్రాలోని కేంద్రాలలో పవిత్ర రమదాన్ మాసంలో పని చేసే కొత్త వర్కింగ్ అవర్స్ ను వెల్లడించారు.
రమదాన్ రోజులలో పాస్‌పోర్ట్, వీసా, ధృవీకరణ సేవల ప్రాసెసింగ్ శనివారం నుండి గురువారం వరకు ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు ఉంటుంది. శుక్రవారం కేంద్రాలకు సెలవు ఉంటుంది. ఏ రోజుననైనా కాన్సులర్ ధృవీకరణ కోసం BLS కేంద్రాలలో జమ చేసిన పత్రాలను తదుపరి పని దినం మధ్యాహ్నం 3:00-4:00 గంటల వరకు సంబంధిత BLS కేంద్రంలో దరఖాస్తుదారులకు తిరిగి ఇస్తారు. అత్యవసర కేసులలో అదే రోజు ధృవీకరణ కోసం అభ్యర్థనలు అత్యవసర స్వభావం ఆధారంగా కేసు-టు-కేస్ ఆధారంగా నిర్ణయించబడతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







