ధోఫర్ లో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు..!!
- March 03, 2025
సలాలా: ధోఫర్ గవర్నరేట్‌లో మూడు పర్వత మార్గాలను అభివృద్ధి చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గవర్నరేట్‌లోని ప్రత్యేక స్థానిక కంపెనీలకు గవర్నరేట్‌లో అడ్వెంచర్ టూరిజం మౌలిక సదుపాయాలను అభివృద్ధి ప్రాజెక్టులను అప్పగించారు. జబల్ సంహాన్‌లో హై-వైర్ (వయా ఫెర్రాటా) కార్యకలాపాల కోసం ట్రాక్ ఏర్పాటును తాజాగా పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రాజెక్టులో చేర్చారు.వీటితోపాటు ఐన్ హషీర్ ప్రాంతం, తబల్ది చెట్లు, ఐన్ గైద్ మార్గంలో పర్వతారోహణ కోసం రోప్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల సౌలభ్యం కోసం నడక మార్గాలను పునరుద్ధరించనున్నారు. ధోఫర్ గవర్నరేట్ భౌగోళిక వైవిధ్యం సాహస పర్యాటకానికి ఎన్నో అవకాశాలను అందిస్తుంది. ఇక్కడి 40 కంటే ఎక్కువ ప్రసిద్ధ పర్వత మార్గాలు పర్యాటకులకు మరిచిపోలేని అనుభవాలను అందిస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!