కేంద్ర మంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ..
- March 05, 2025
న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.
ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏపీకి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్ర మంత్రులతో చర్చించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 7న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఏపీ సెక్రటేరియట్ ఫస్ట్ బ్లాక్‌లోని కేబినెట్ హాల్‌లో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







