కల్యాణ్‌రామ్ కొత్త చిత్రం 'ఇజం'
- July 04, 2016
పూరి జగన్నాథ్ సినిమాల్లో కథానాయకుడు పక్కా మాస్ అయి ఉంటాడు. అందుకు తగ్గట్టే ఆయన సినిమా పేర్లు కూడా ఉంటాయి. ఇడియట్, పోకిరి, లోఫర్ ఇలాంటి టైటిల్స్‌తోనే ఆయన విజయాలు అందుకున్నారు. ఇక ప్రతీసారి విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు రావాలని తపించే నటుడు కల్యాణ్‌రామ్. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రేపు కల్యాణ్‌రామ్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కల్యాణ్‌రామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. రెండు పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రానికి 'ఇజం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'ఈ వ్యక్తిని మీరు అరెస్టు చేయగలరు. కానీ అతడి ఐడియాలను అరెస్టు చేయలేరు. అతడు ప్రత్యేకం, చంపడానికి అతడి దగ్గర కథ ఉంది' అని ఈ రెండు పోస్టర్లపై రాసి ఉంది. ''ఇంతకీ ఈ 'ఇజం' అనే పదం ఎక్కడి నుంచీ పుట్టిందో తెలుసా.. కమ్యూనిజం, హీరోయిజం, జర్నలిజం, హ్యూమనిజం, రియలిజం ఇలాంటి పదాల్లోని చివరి అక్షరం అండి అది'అని పోస్టర్‌పై పేర్కొన్నారు. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







