ప్రభుదేవా తో కలిసి చిందేసిన తమన్నా
- July 04, 2016
ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా గుర్తింపు పొందిన ప్రభుదేవాతో కలిసి మిల్కీబ్యూటీ తమన్నా అద్భుతమైన స్టెప్పులు వేశారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'అభినేత్రి' చిత్రం రిహార్సల్స్‌లో భాగంగా తీసిన ఒక వీడియోను తమన్నా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తమన్నా.. ప్రభుదేవా, పరేశ్ శిరోద్కర్‌తో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ డ్యాన్స్‌కు అభిమానులే కాదు... పలువురు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. శ్రుతిహాసన్, దేవిశ్రీ ప్రసాద్, ఖుష్బు, విద్యులేఖ రామన్ ట్విట్టర్ ద్వారా తమన్నాను ప్రశంసించారు. వీరందరికీ మిల్కీబ్యూటీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుదేవా కూడా తమన్నా ఒక్కటే రిహార్సల్స్ చేస్తున్న ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న 'అభినేత్రి' చిత్రానికి కోనా వెంకట్ కథ అందించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సోనూసూద్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభుదేవాతో కలిసి పనిచేయాలనే కోరికతో 'అభినేత్రి'లో నటిస్తున్నట్లు టీజర్ విడుదల కార్యక్రమంలో తమన్నా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







