ICC Champions Trophy: హై-వోల్టేజ్ మ్యాచ్‌ కు సర్వం సిద్ధం..

- March 09, 2025 , by Maagulf
ICC Champions Trophy: హై-వోల్టేజ్ మ్యాచ్‌ కు సర్వం సిద్ధం..

దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. ఎంతో ఉత్కంఠభరితంగా, క్రికెట్ ప్రియులను ఆకట్టుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు సమయం ఆసన్నమైంది.

భారత్-న్యూజిలాండ్ జట్లు తుది పోరుకు సిద్ధమవుతున్నాయి. హోరాహోరీగా సాగనున్న మెగా ఫైనల్ ఫైల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. ఈ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 2.30 కి ప్రారంభం కానుంది వరుస విజయాలతో దూకుడుమీదున్న టీమిండియా ఫైనల్ లో గెలిచి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో టీమిండియా ఐదోసారి అడుగుపెట్టింది. టీమిండియా ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫైనల్స్‌లో ఆడగా రెండు సార్లు టైటిల్‌తో స్వదేశానికి తిరిగొచ్చింది. దుబాయ్ వేదిక ఇప్పుడు ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో తలపడనుంది.

మ‌రోవైపు సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి ఫైనల్స్ లో అడుగుపెట్టిన కివీస్ ఛాంపియన్ ట్రోఫీపై కన్నేసింది. అయితే, ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో భార‌త్ – న్యూజిలాండ్ తలపడటం ఇది మూడోసారి. గత రెండు ఫైనల్స్‌లోనూ కివీస్ భారత్‌పై గెలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com