తెలుగు రాష్ట్రాల సీఎంలకు NATS ఆహ్వానం
- March 14, 2025
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను నాట్స్ టీం ఆహ్వానించింది. టంపా వేదికగా జూలై 4,5,6 తేదీల్లో జరగనున్న 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అమెరికాలో తెలుగువారందరూ కలిసి చేసుకునే పండుగ అమెరికా తెలుగు సంబరాలని.. ఈ సంబరాల్లో పాలుపంచుకుంటే తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని నాట్స్ బృందం సభ్యులు చంద్రబాబును అభ్యర్థించారు. సంబరాల్లో నిర్వహించే కార్యక్రమాల గురించి నాట్స్ బృందం చంద్రబాబుకు వివరించింది. ఇక అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాట్స్ బృందం కలిసింది.అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాట్స్ సంబరాలకు విచ్చేస్తే తెలుగు వారి ఐక్యత ను ప్రతిబింబించనట్టు ఉంటుందని నాట్స్ బృందం తెలిపింది. ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







