స్వీయవిశ్వం:-
- September 29, 2017
సాంద్రతిమిరకుహరం
మృణ్మయవల్మీకం
కుడ్యకోణం
తరుమూలం
సర్పసరటపిపీలికాది సరీసృపాల
సువిశాలవిశ్వం;
నీరదావలయుతగగనం
హర్మ్యశిఖరం
ద్రుమోపరిపల్లవం
శాఖోపరినీడం
శుకకాకచటకాది పక్షిసమూహాల
సువిశాలవిశ్వం;
సరోవరస్రోతస్వినీమహార్ణవసలిలం
గభీరాంతస్సాగరవసిత శిలాసర్వస్వం
తీరోపరిసైకతం
సైకతోపరిప్రకాశం
మత్స్యకూర్మమకరతిమింగలాది జలచరాల
సువిశాలవిశ్వం;
నిత్యయామినీసదృశమహాంతరిక్షం
సూర్యచంద్రతారాగ్రహమండలం
సప్తఖండ పంచమహాసముద్ర పర్యంతం
సమస్తజీవసామ్రాజ్యాధిపత్యం
నానాదేశప్రదేశ మానవసమూహాల
సువిశాలవిశ్వం;
నా కన్నెంత?
నా చూపెంత?
నీటికి వెలుపల విశ్వమెంతుందో
చేపకేం తెలుసు?
అంతరిక్షం అవతల విశ్వమెంతుందో
మనిషికేం తెలుసు?
విశ్వం ఒకటి కాదు!
కోట్లాది విశ్వాలు!
ఒక్కో జీవిది ఒక్కో విశ్వం
-సిరాశ్రీ
తాజా వార్తలు
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS







