చికెన్ స్టిక్బార్
- December 10, 2017కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్- 250 గ్రా, పచ్చిబఠానీ - 50 గ్రా, బంగాళదుంపలు - 100 గ్రా, గరంమసాలా - టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, కారం - 2 టీస్పూన్లు, ఉప్పు - తగినంత, కోడిగుడ్డు - 1.
తయారీ పద్ధతి: చికెన్‌కు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్‌పై బాణలి పెట్టి చికెనను మిగతా పదార్ధాలతో (కోడిగుడ్డు మినహా) కలిపి ఉడికించి, చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి. ప్లేట్లో చాకోబార్ షేప్‌లో చికెన మిశ్రమాన్ని సర్ది, దానికి ఐస్‌క్రీం పుల్లను గుచ్చాలి. ఒక పాత్రలో కోడిగుడ్డును గిలక్కొట్టి పక్కన ఉంచాలి. పెనం మీద నూనె వేసి చికెన్ స్టిక్బార్ని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి రెండువైపులా డీప్‌ఫ్రై చేయాలి. టొమాటో సాస్‌తో కలిపి వేడివేడిగా తినాలి. అంతే.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు