తిరుమలలో భక్తుల రద్దీ..
- May 04, 2024
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామి వారిని 62,624 మంది భక్తులు దర్శించుకోగా.. 32,638 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు సమకూరింది. ఓ వైపు వేసవి సెలవులు కావడం.. మరోవైపు ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఎగ్జామ్స్ లలో ఉత్తీర్ణత సాధించిన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగిందని, రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇక గత ఏప్రిల్ నెలలో శ్రీవారిని 20.17 లక్షలు మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.101.63 కోట్లు రాగా.. 94.22 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. మరోవైపు ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. కానీ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. వరుస సెలవులు వచ్చినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా పెరగలేదు. ఇక తిరుమలకి వెళ్ళిన భక్తులు కూడా ఎండల దెబ్బకు ఇబ్బంది పడుతున్నారు
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..