సేమియా తో చికెన్ బిర్యానీ
- January 26, 2018_1517025108.jpg)
కావలసిన పదార్థాలు : సేమియా-అర కేజి, నిమ్మకాయ-1, చికెన్-అర కేజి, పచ్చిమిర్చి-10గ్రా, దాల్చిన చెక్క-1, లవంగాలు-6, ఉల్లిపాయలు-2, నూనె-తగినంత, కొత్తిమీర-6 రెబ్బలు, అల్లంవెల్లుల్లి ముద్ద-20గ్రా, ఉప్పు-తగినంత, బిర్యానీ ఆకు-10గ్రా, యాలకులు-2, జీడిపప్పు-200గ్రా, పసుపు-చిటికెడు.
తయారుచేయు విధానం : ముందుగా స్టవ్‌పై గిన్నె ఉంచి అందులో నాలుగు గ్లాసుల నీళ్ళు పోయాలి. అందులో సేమియా వేసి, ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూను నూనె వేసి అయిదు నిమిషాలు ఉంచి దించేయాలి. తడి బట్ట తీసుకుని ఉడికిన సేమియాను అందులో వేసి వడగట్టాలి. నీరంతా పోయిన తర్వాత సేమియాను ఒక ప్లేటులోకి తీసి పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్‌పై మరో గిన్నె ఉంచి, కొద్దిగా నూనె వేసి, శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలను అందులో వేసి చిన్న మంటపై అయిదు నిమిషాలు ఉడికించాలి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పసుపు అన్ని కలిపి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడి చికెన్‌పై చల్లి, అల్లంవెల్లుల్లి ముద్ద కూడా అందులో వేసి బాగా కలపాలి. చిన్న మంటపై మరో అయిదు నిమిషాలు చికెన్‌ను ఉడికించి, ఆపైన సేమియా కూడా వేసి మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, కొత్తిమీర ఆకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసి బాగా కలిపి దించేయాలి. అంతే- సేమియా చికెన్ బిర్యానీ రెడీ అయినట్లే.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా