నిమ్మరసం వేడి నీటిలో కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?
- January 26, 2018
ఉదయం నిద్రలేస్తూనే గోరువెచ్చని నీటిలోకి నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచిదని అందరికీ తెలుసు. కాని దేనికి ఎంత వరకు ప్రాధాన్యమివ్వాలో, ఎలా తాగాలో చాలామందికి తెలియదు. ఈ ఫార్ములా మంచిదే కదా అని కొందరు అధికంగా నిమ్మరసాన్ని వాడుతుంటారు. అలా చేస్తే పులుపు పండ్ల చిగుళ్లు దెబ్బతింటాయి.అందుకే.. సగం నిమ్మపండుకంటే ఎక్కువ వాడకూడదు. నిమ్మకు బరువు తగ్గించే గుణం ఉంది కదా అని దానిని ఎక్కువ వాడితే ఎసిడిటీ వృద్ధి చెందుతుంది. అది చేసే అసలు పనికి ఆటంకం ఏర్పడుతుంది. మోతాదుకు మించి వాడొద్దు. వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగే ముందు.. మామూలు నీళ్లతో నోటిని రెండుమూడుసార్లు పుక్కిలించిన తర్వాతే తాగాలి. లేదంటే బ్రెష్ చేసుకుని తాగితే ఇంకా మంచిది. లేకపోతే నోట్లోని బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంది. చాలామంది జిమ్, జాగింగ్ వెళ్ళినప్పుడు దుకాణాల్లో బాటిళ్లలో విక్రయించే నిమ్మరసం తాగుతుంటారు. ఆరోగ్యానికి అది ఏమాత్రం మంచిది కాదు. ఇంట్లోనే సహజమైన నిమ్మకాయలను పిండుకున్న నీటిని తాగితేనే బెటర్. నీళ్లు నిమ్మరసంలోకి మోతాదుకు మించి తెనెను కలపకూడదు . కొందరైతే వేడినీటి నీటిలోకి తేనెను కలిపేస్తుంటారు. ఈ అలవాటూ ఆరోగ్యకరమైనది కాదు.
తాజా వార్తలు
- సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు హ్యాక్
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!







