కాబూల్‌లో జంట పేలుళ్లు.. 21 మంది మృతి
- April 30, 2018
కాబూల్: ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ నగరం నెత్తురోడింది. ఉదయం షష్టారక్ ప్రాంతంలో జరిగిన ఓ పేలుడులో ఐదుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు పాత్రికేయులు గుమిగూడి ఉన్నసమయంలో ఓ వ్యక్తి వారితో కలిసి పోయి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం 21 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 27 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రముఖ మీడియా సంస్థ ఏఎఫ్‌పీకి చెందిన ఫోటోగ్రాఫర్ షా మరై మృతిచెందారు. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఈ పేలుళ్లకు సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!