భారత్ × ఆస్ట్రేలియా: షెడ్యూల్ విడుదల
- April 30, 2018మెల్‌బోర్న్: ఈ ఏడాది కోహ్లీసేన వరుసగా టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీగా గడపనుంది. ఐపీఎల్ అనంతరం టీమిండియా వన్డే, టీ20, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లనున్న విషయం తెలిసిందే. జులైలో ఈ పర్యటన ప్రారంభం కానుంది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా 2018-19కి సంబంధించి ఆసీస్ ఆడే క్రికెట్ మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. 2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు భారత్-ఆసీస్ మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నట్లు పేర్కొంది. ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య ఆసీస్‌తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. పర్యటనలో టీ20 సిరీస్‌తో భారత్ తన పర్యటనను ప్రారంభించనుంది.
షెడ్యూల్:
మొదటి టీ20: నవంబరు 21- గబ్బా
రెండో టీ20: నవంబరు 23- మెల్‌బోర్న్
మూడో టీ20: నవంబరు 25- సిడ్నీ
మొదటి టెస్టు: డిసెంబరు 6 - ఆడిలైట్
రెండో టెస్టు: డిసెంబరు 14 - పెర్త్
మూడో టెస్టు: డిసెంబరు 26 - మెల్‌బోర్న్(బాక్సింగ్ డే టెస్టు)
నాలుగో టెస్టు: జనవరి 3- సిడ్నీ
మొదటి వన్డే: జనవరి 12- సిడ్నీ
రెండో వన్డే: జనవరి 15- ఆడిలైట్
మూడో వన్డే: జనవరి 18- మెల్‌బోర్న్
ఈ మూడు సిరీస్‌ల్లో ఆసీస్ ఆటగాళ్లు స్మిత్, వార్నర్ ఆడలేరు. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా వీరిద్దరిపై విధించిన 12 నెలల నిషేధం 2019 మార్చిలో ముగియనుంది. దీంతో వీరు ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. ఇదే వివాదంలో 9 నెలల నిషేధం ఎదుర్కొంటున్న బాన్‌క్రాఫ్ట్ భారత్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు.
తాజా వార్తలు
- కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు కార్యాచరణ..ఈవీలకు ప్రోత్సాహం..!!
- యూఏఈలో అమెరికా అపాంట్మెంట్స్..డిలే, రిస్క్ ను ఎలా తగ్గించాలంటే..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..!!
- ఆన్ లైన్ లో అటెస్టేషన్ సేవలు ప్రారంభం..ఇక 24గంటలు క్లియరెన్స్ సర్టిఫికేట్..!!
- 120 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ తొలగింపు.. 14వేల ఛానెల్స్ మూసివేత..!!
- టీమిండియా ఆల్‌రౌండ్ షో….తొలి టీ20లో బంగ్లా చిత్తు
- TANA వైద్యశిబిరం విజయవంతం-550 మందికి చికిత్స
- Systematic Withdrawal Plan (SWP) ప్లాన్ లాభాల గురించి తెలుసా..?
- చెన్నై ఎయిర్ షో లో విషాదం
- గోవా రైల్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చ జెండా